Rahul Raj | రైతులతో కలిసి నాట్లేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు..
Rahul Raj | ఆయన కలెక్టర్. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో బిజీబిజీగా గడిపే అధికారి. పనులను పక్కనపెట్టి సెలవు రోజైన ఆదివారం పొలంబాట పట్టారు. భార్యతో కలిసి సాధారణ వ్యవసాయ కూలిల్లా మారి పొలంలో నాట్లు వేశారు.
Rahul Raj | ఆయన కలెక్టర్. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో బిజీబిజీగా గడిపే అధికారి. పనులను పక్కనపెట్టి సెలవు రోజైన ఆదివారం పొలంబాట పట్టారు. భార్యతో కలిసి సాధారణ వ్యవసాయ కూలిల్లా మారి పొలంలో నాట్లు వేశారు. ఆ అధికారి ఎవరో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఔరంగాబాద్ గొల్ల నారాయణ అనే రైతు పొలం కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు రైతులతో కలిసి వరి నాట్లువేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సుమారుగా 70వేల రైతులకు రూ.447 కోట్ల రైతు రుణమాఫీ నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
లాభదాయక సాగు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని.. అందుకు తోడ్పాటు అందించేందుకే పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిందని రైతులకు వివరించారు. నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు వరినాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

