హరిభూషణ్, భారతక్క మృతిపై జగన్ లేఖ విడుదల
హరిభూషణ్ | మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గత నాలుగు రోజుల నుంచి

మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ భారతక్క సైతం కరోనాతో మృతి
అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదల
కొత్తగూడెం క్రైం: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గత నాలుగు రోజుల నుంచి వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు.
హరిభూషణ్ గత కొంతకాలంగా బ్లాంకైటిస్ ఆస్తమాతో బాధపడుతున్నాడని, పరిస్థితి విషమించడంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 9గంటలకు మృతి చెందాడని, భారతక్క ఈ నెల 22వ తేదీన ఉదయం 9:50గంటలకు మృతి చెందిందని లేఖలో తెలిపారు. వీరి అంత్యక్రియలను మంగళవారం ప్రజల సమక్షంలో జరిపి, వారికి శ్రద్ధాంజలి ఘటించినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. దీంతో హరిభూషణ్ మృతి వార్తపై స్పష్టత వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

