డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క
శారదక్క | మావోయిస్టు నేత శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు

హైదరాబాద్: మావోయిస్టు నేత శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం మహబూబాద్ జిల్లాలోని గంగారం. పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితురాలైన ఆమె 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. కాగా, శారదక్క భర్త అయిన మావోయిస్టు నేత హరిభూషణ్.. ఈ ఏడాది జూన్ 21 కరోనాతో చనిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గంటలకు శారదక్క లొంగుబాటుకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

