Lord Hanuman’s seat | హనుమాన్ సీట్లో కూర్చున్న వ్యక్తిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి.. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఘటన.. వీడియో
Lord Hanuman's seat | రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన 'ఆదిపురుష్' సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజే హైదారాబాద్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడులు జరిగాయి.
హైదరాబాద్: రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజే హైదారాబాద్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడులు జరిగాయి. సినిమా బాగాలేదన్నందుకు ఐమ్యాక్స్ థియేటర్లో ఓ వ్యక్తిపైన, హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు భ్రమరాంబ థియేటర్లో ఓ వ్యక్తిపైన ప్రభాస్ అభిమానులు దాడులకు పాల్పడ్డారు.
‘ఆదిపురుష్’ ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని కొన్ని రోజుల క్రితం ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ థియేటర్ల యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక్కో సీటును ఖాళీగా విడిచిపెడుతున్నారు. ఆ సీటుపై కాషాయం వస్త్రం కప్పి, సీట్లో పూలు, పండ్లు పెట్టి ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే బ్రమరాంబ థియేటర్లో కూడా హనుమంతుడి కోసం ఒక సీటును విడిచిపెట్టారు.
అయితే, సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ సీట్లో కూర్చోవడం గొడవకు దారితీసింది. ప్రభాస్ అభిమానులు కొందరు వచ్చి అతడితో గొడవకు దిగారు. అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కార్తీక్ నాగ అనే వ్యక్తి వీడియో తీసిన ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన సందర్భంగా బూతు పదజాలం వినియోగించినందున వీడియోను మ్యూట్ చేసి ట్విటర్లో పెట్టారు.
A person was attacked by Prabhas fans for sitting in a seat allocated to Lord Hanuman in Bramarambha theatre Hyderabad in the early hours of this morning. (Audio muted due to abusive words)#Prabhas #PrabhasFans #Adipurush #AdipurushReview pic.twitter.com/2dkUhQFNVi
— Kartheek Naaga (@kartheeknaaga) June 16, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

