బనకచర్లపై లోకేశ్ వ్యాఖ్యలు సరికాదు
బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు.
- తప్పుదారి పట్టించేలా ఏపీ మంత్రి నారా ప్రకటన
- తెలంగాణ జలాలపై ఏపీ సర్కార్ కుట్ర
- మా వాటా వాడుకున్నాకే ఆలోచిస్తాం
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కొల్లాపూర్, ఆగస్టు 2 : బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. వృథా నీటితో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు లోకేశ్ చేసిన ప్రకటనలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఎగువ ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో దిగువకు నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అవసరాలు పూర్తయిన తర్వాతే బనకచర్ల తదుపరి చర్చకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తుందని స్పష్టంచేశారు.
నదీ జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. గోదావరి నీటిని కూడా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఎత్తిపోతలకు వినియోగిస్తామని చెప్పారు. పోలవరం నుంచి సముద్రంలో కలుస్తున్న నీటి వినియోగం కోసం బనకచర్ల నిర్మిస్తున్నట్టు అమాయకంగా లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ నీళ్లు వృథాగా పోయేవి కావని, తెలంగాణ వాటా వాడుకున్నాకే.. మిగితా రాష్ర్టాల నీటి హక్కుల గురించి ఆలోచిస్తామన్నారు. పీఆర్ఎల్ఐ పెండింగ్ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

