కేటీఆర్ సాయం.. మాలికకు కాంస్యం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయం చేసిన చెస్ క్రీడాకారిణి మాలిక హండా అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది. మలేషియాలోని పెనాంగ్‌లో ఇటీవల జరిగిన ఆసియా పసిఫిక్ డెఫ్ మల్టీస్పోర్ట్స్ చాంపియన్‌షిప్-2026లో మహిళల క్లాసికల్ వ్యక్తిగత విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా కేటీఆర్ సోమవారం ‘ఎక్స్' ద్వారా మాలికా హండాను అభినందించారు.
- ఆసియా పసిఫిక్ డెఫ్ మల్టీ స్పోర్ట్స్ చెస్ పోటీల్లో మాలిక హండా సత్తా
- ‘ఎక్స్’లో క్రీడాకారిణికి రామన్న అభినందన
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయం చేసిన చెస్ క్రీడాకారిణి మాలిక హండా అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది. మలేషియాలోని పెనాంగ్‌లో ఇటీవల జరిగిన ఆసియా పసిఫిక్ డెఫ్ మల్టీస్పోర్ట్స్ చాంపియన్‌షిప్-2026లో మహిళల క్లాసికల్ వ్యక్తిగత విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా కేటీఆర్ సోమవారం ‘ఎక్స్’ ద్వారా మాలికా హండాను అభినందించారు.
మాలిక ప్రతిభను గుర్తించిన కేటీఆర్ 2022 జనవరిలో వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.15 లక్షలతోపాటు చెస్ పోటీలకు సన్నద్ధమయ్యేందుకు ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. అంతేగాక మాలికకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అప్పటి కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తిచేశారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించి మాలిక నేటితరానికి స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు. ఆమె క్రీడా ప్రయాణంలో తాను కొంతమేర సహకరించినందుకు గర్వంగా ఉన్నదని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

