హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ 70 వ జన్మదిన( KCR birthday) వేడుకలను ప్రపంచమంతా (World wide) ఎన్నారైలు(NRI) ఘనంగా నిర్వహిస్తారని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరపాలని వివిధ దేశాల బీఆర్ఎస్ ప్రతినిధితులను కోరామన్నారు. కొన్ని దేశాల్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సంఘీభావంగా మొక్కలు నాటడం, అనాథలకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతామన్నారు. ఎన్నారైలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.