హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 4 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల పరిశీలన, 14 వరకు ఉపసంహరణ గడువు ఇచ్చారు. 28న పోలింగ్, ఏప్రిల్ 2న విజేతను ప్రకటిస్తారు. ఈ నోటిఫికేషన్తో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నది.