క్లస్టర్ల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు

- పరిశీలనకు అధికారుల బృందాలు
- ప్రక్రియనంతా 15 రోజుల్లో పూర్తిచేయాలి
- జిల్లా కలెక్టర్లకు మున్సిపల్‌శాఖ ఆదేశం
హైదరాబాద్, జూలై 20 ( నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై కదిలిక మొదలైంది. గత ఏడాది ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను గ్రామ పంచాయతీలు, కాలనీలు, ఆయా ప్రాంతాల ప్రాతిపదికన క్లస్టర్ల వారీగా విభజించాలని జిల్లా కలెక్టర్లను మున్సిపల్‌శాఖ ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించడానికి వివిధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటుచేయాలని పేర్కొన్నది. ఈ బృందంలో రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండేలా చూడాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారి భూములను ఈ బృందం తనిఖీ చేసి కలెక్టర్‌కు, సంబంధిత కమిషనర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఎల్ఆర్ఎస్కు అర్హత ఉన్నవి, అర్హత లేనివి, వాటి సమగ్ర వివరాలను బృందం సభ్యులు ఆన్లైన్లో సమర్పించాలి. కలెక్టర్లు, కమిషనర్లు.. ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియనంతా జిల్లా కలెక్టర్లు 15 రోజుల్లో పూర్తిచేయాలని అర్వింద్‌కుమార్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cluster
- LRS applications
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

