తక్కువ కిరాయికే వ్యవసాయ పరికరాలు
- మండలానికి ఒక సీహెచ్‌సీ ఏర్పాటు
- మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు
- 25 శాతం సబ్సిడీతో రుణం సౌకర్యం
- చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే కిరాయికి ఇచ్చేందుకు వీలుగా ప్రతి గ్రామీణ మండలంలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్(సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 536 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో సీహెచ్‌సీలను ఏర్పాటుచేశారు. మిగిలిన 405 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున సీహెచ్‌సీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క మండలానికి గరిష్ఠంగా రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటుచేస్తారు. పెట్టుబడి వ్యయంలో 25 శాతం సబ్సిడీగా ఇస్తారు. మిగిలిన మొత్తం స్త్రీనిధి లేదా ఇతర బ్యాంకుల ద్వారా మహిళా మండల సమాఖ్యలకు రుణంగా ఇప్పిస్తారు. మండలంలో ఎక్కువగా సాగు చేసే పంటలను గుర్తించి, అందుకు అవసరమైన వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తారు.
ఆయా పరికరాలను ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్న కిరాయి కంటే తక్కువ ధరకే రైతులకు ఇవ్వనున్నారు. దీంతో వ్యవసాయ పరికరాలను సొంతంగా కొనుగోలు చేయలేని చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. సీహెచ్‌సీల ఏర్పాటుతో పోటీ వాతావరణం ఏర్పడి ప్రైవేట్ వ్యక్తులు కూడా కిరాయిలు తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొంతకాలంగా యంత్ర పరికరాల వాడకం పెరుగుతున్నది. దీంతో ఆయా యంత్రాల కిరాయిలు కూడా పెరిగాయి. సీహెచ్‌సీల ద్వారా ఇవి తక్కువ కిరాయికే అందుబాటులోకి రావడంతో ఆ మేరకు వ్యవసాయంపై పెట్టుబడి కూడా తగ్గనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- agricultural
- chc
- farmers
- machinery
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

