TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం..! దంచికొట్టనున్న వానలు..!
TG Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.
TG Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్ గ్రామంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది. అలాగే, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 9.1, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 8.1 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని చెప్పింది. అలాగే, కుమ్రంభీం, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, హన్మకొండ, సిద్దిపేట, వరంగల్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం రికార్డయ్యింది. మరో వైపు రాగల వారం రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. శుక్ర, శనివార్లాలోనూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

