ప్రజల ప్రాణాలు కాపాడేందుకే లౌక్ డౌన్
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను దీని నుంచి కాపాడేందుకే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను దీని నుంచి కాపాడేందుకే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్ -19పై జిల్లా కలెక్టరేట్ వద్ద గల ఇల్లందు క్లబ్ హౌస్లో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ మహమ్మారి మనం ఊహించింది కాదు. అయితే తగు జాగ్రత్తలతో దీనిని అధిగమించ వచ్చని మంత్రి తెలిపారు.
రెమిడెసివర్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉన్నందున దానిని కూడా కావాల్సినంత సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. వారికి మందులు ఇవ్వడంతో పాటు మనో ధైర్యం కల్పించాలన్నారు.
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పని చేస్తూ ఈ కష్ట కాలాన్ని అధిగమించాలి. ప్రజల ప్రాణాలను కాపాడలన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలన్నారు.
లాక్ డౌన్ లో ఇంకా ఏం చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందో అధికారులు సూచించాలి. పరీక్షలు చేసుకుని ఇంట్లో ఉండేవాళ్లు చాలా మంది పేదవాళ్లు. కాబట్టి ఎక్కువ ఇసొలేషన్ కేంద్రాలు పెట్టి వారిని సంరక్షించాలని మంత్రి ఆదేశించారు.
ఎక్కడి రోగులకు అక్కడే పూర్తి స్థాయి వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.లాక్ డౌన్ సమయంలో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే ప్రైవేట్స్ హాస్పిటల్స్పై నిఘా పెట్టి వారికి సరైన సూచనలు చేయాలన్నారు.
సమావేశానికి ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ జక్కుల హర్షిణి, ఎమ్మెల్యే లు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ప్రాజెక్ట్ అధికారి హన్మంతు జెండగే, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఇతర పోలీస్, వైద్య, జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

