Dhyanam | క్రియాయోగ ధ్యానంతో సాఫల్యవంతమైన జీవితం..!!
ప్రాచీన భారతీయ రుషి పరంపర నుంచి వరంగా వచ్చిన సనాతన క్రియాయోగ ధ్యానం (Dhyanam) అభ్యసించడం ద్వారా ఆనందకరమైన, సాఫల్యవంతమైన జీవితం సాధ్యమని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద తెలిపారు.
హైదరాబాద్: ప్రాచీన భారతీయ రుషి పరంపర నుంచి వరంగా వచ్చిన సనాతన క్రియాయోగ ధ్యానం (Dhyanam) అభ్యసించడం ద్వారా ఆనందకరమైన, సాఫల్యవంతమైన జీవితం సాధ్యమని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద తెలిపారు. ఈ ధ్యానం ద్వారా శారీరక రుగ్మతలు తొలగి, మానసిక వైఫల్యాలు అధిగమించి ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతారని ఆయన చెప్పారు.
ఈ ధ్యానం ద్వారా నిశ్చలత్వం ఏర్పడి ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఆయన అన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి స్మరణానంద ప్రసంగించారు. క్రియాయోగం శాస్త్రీయమైనదని, దీని అభ్యాసం ద్వారా శాస్త్రీయ ఫలితాలు సాధ్యమని ఆయన తెలిపారు. క్రమబద్ధంగా ఈ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు భగవదాన్వేషణలో సత్వర పురోగతి సాధ్యమని ఆయన తెలిపారు.
పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్ఎస్ క్రియాయోగ పాఠాలు, అందులో పేర్కొన్న పద్ధతులు సాధకులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. వైఎస్ఎస్ పాఠాల ద్వారా ప్రయోజనం పొందాలని స్వామి స్మరణానంద సాధకులకు సూచించారు. కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు, క్రియోయోగులు వేలాదిగా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

