అసైన్డ్ భూములను అప్పగించాలి

- సీపీఐపై ఈటల వ్యాఖ్యలు అనాలోచితం
- టీఆర్ఎస్ను లౌకికపార్టీగా చూస్తున్నాం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ పార్టీపై చేసిన ఆరోపణలు అసందర్భం, అనాలోచితమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఒకవైపు తాను వామపక్ష, లౌకికవాదినని చెప్పుకొంటూ, పచ్చి మతోన్మాత ఫాసిస్టు బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతోనే ఈటల వైఖరి అర్థమవుతున్నదని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. అసైన్డ్ భూములను ఎవరు కొనుగోలు చేసినా వాటిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయడమే సమంజసమని హితవు చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ తన తండ్రి కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. శనివారం చాడ వెంకటరెడ్డి జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, సీపీఐ ఎన్నికల్లో పోటీ చేయాలో? వద్దో? ఎవరు నిర్ణయిస్తారో తెలుసంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, పూర్తిగా నిరాధారమైనవని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అయిన సీపీఐ ఎవరి మార్గదర్శనాలకు, వ్యక్తుల ప్రమేయాలకు అనుగుణంగా నడవదని స్పష్టంచేశారు. ఈటల తన ఉనికి కోసమే బీజేపీలో చేరుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీఆర్ఎస్, సీపీఐ మధ్య రాజకీయంగా ఎన్నడూ చర్చ జరగలేదని తెలిపారు.
టీఆర్ఎస్ లౌకిక పార్టీ
తమ ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ మార్గదర్శనం ప్రకారం పనిచేస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టంచేశారు. తాము టీఆర్ఎస్ను లౌకిక పార్టీగానే చూస్తున్నామని, ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని ఓడించే లౌకిక పార్టీల్లో బలమైన పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియంతృత్వ, ప్రజా వ్యతిరేక విధానాలతో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని, వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఈటల కూడా ఈ చట్టాలు రైతు వ్యతిరేకమన్నారని గుర్తుచేశారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూములన్నిటినీ డిజిటల్ సర్వే చేపట్టే ముందే విధి విధానాలు రూపొందించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వానికి చాడ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

