తొలి ఏకాదశి.. యాదాద్రిలో లక్ష పుష్పార్చన
తొలి ఏకాదశి | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం సర్వేశ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా,

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం సర్వేశ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా, వైభవంగా జరిగాయి. స్వా మి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలతోపాటు ప్రత్యేక సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. యాదాద్రీశుడి నిత్య పూజలు వేకువజామునే ప్రారంభం అయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

