Himanshu | ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేటీఆర్ తనయుడు హిమాన్షు
KTR’s Son Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు, కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
KTR’s Son Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు, కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల హిమాన్షు వ్యాయామం చేస్తుండగా లేదా క్రీడలు ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైంది. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆసుపత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించి, వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అయితే హిమాన్షు ఆరోగ్య పరిస్థితి మెరుగపడడంతో గురువారం డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు హిమాన్షుకు జరిగింది చిన్నపాటి గాయమేనని, ఆందోళన చెందాల్సిన పనిలేదని.. మరికొద్ది రోజుల్లోనే ఆయన పూర్తి సాధారణ స్థితికి చేరుకుంటారని కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హిమాన్షు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

