హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మానవత్వంతో మీ పనిని కొనసాగించండి. మీ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించండి. మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ప్రకాశ్‌కు కేటీఆర్ అభినందనలు
తన బ్యాటరీ ట్రై సైకిల్‌ను వితరణ చేస్తానని తెలిపిన ప్రకాశ్ అనే దివ్యాంగుడికి మంత్రి కే తారక రామారావు అభినందనలు తెలిపారు. ప్రకాశ్‌ది గొప్ప మనసు అని కొనియాడారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘నేను కొత్త బ్యాటరీ ట్రై సైకిల్ కొనుగోలు చేశాను. పాతది వితరణ చేయాలని అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది. అభ్యంతరం లేకపోతే అందజేస్తాను’ అంటూ కేటీఆర్‌కు ప్రకాశ్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి పైవిధంగా స్పందించారు.