కిడ్నీ బాధితుడి వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసా

నిమ్స్‌లో చేరాలని మంత్రి కార్యాలయం నుంచి ఫోన్
చేర్యాల, జూలై 21: కిడ్నీ బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. వెంటనే నిమ్స్‌లో చేరాలని మంత్రి కార్యాలయం నుంచి బాధిత కుటుంబానికి ఫోన్ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు మహ్మద్ సద్దాం 15 నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, ఇప్పటికే లక్షల్లో డబ్బులు ఖర్చు చేసినా నయం కాలేదని, సద్దాంకు మెరుగైన వైద్యం చేయించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశేగుడిసెల సర్పంచ్ షేక్ ఫకీర్, యువకుడు ప్రశాం త్.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సీఎంవో కార్యాలయంతోపాటు హీరో సోనూసూద్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ మెరుగైన వైద్యం అందిస్తామంటూ రీట్వీట్ చేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తామని, వెంటనే నిమ్స్‌లో చేరాలని మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చినట్టు సర్పంచ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Kidney patient
- KTR
- NIMS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

