KTR | రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కేటీఆర్ ఘన నివాళి..
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు.
హైదరాబాద్: సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యంగ నిర్మాత పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల సాధనకు పునరంకితమవుదామన్నారు.
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు 💐
తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడింది.
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్… pic.twitter.com/SNRx3k3hn6
— KTR (@KTRBRS) December 6, 2025
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. తెలంగాణ భవన్ లో ఆ మహనీయుని చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ నాయకులు pic.twitter.com/NoQJTqMnRH
— BRS Party (@BRSparty) December 6, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

