ఇంటి ముందే వైద్య పరీక్షలు
ఇంటిముందే వైద్య పరీక్షలు నిర్వహించేలా ‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ఎంపీ రంజిత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు.
- చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి కానుక
- మొబైల్ క్లినిక్ సేవల కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు
- బస్సును ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- చేవెళ్ల ప్రజలకు గొప్ప బహుమతి ఇచ్చావంటూ మంత్రి ప్రశంస
హైదరాబాద్/షాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఇంటిముందే వైద్య పరీక్షలు నిర్వహించేలా ‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ఎంపీ రంజిత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ క్లినిక్ (ప్రత్యేక బస్)ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ క్లినిక్‌ను ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మొబైల్ క్లినిక్ నియోజకర్గంలోని ప్రతి గ్రామానికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు బీపీ, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలను ఉచితంగా చేయనున్నారు.
కొన్నేండ్లుగా తాను నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో 25 శాతం మంది ప్రజలు బీపీ, మధుమేహం, పలు రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిలో ఈ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఈ మొబైల్ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలు వైద్య పరీక్షలు సులువుగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రశంస..
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షల కోసం మొబైల్ క్లినిక్‌ను ఏర్పాటు చేసిన ఎంపీ రంజిత్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చేవెళ్ల ప్రజలకు గొప్ప బహుమతి ఇచ్చావంటూ ప్రశంసించారు. ప్రజలకు చేస్తున్న ఈ సేవాభావం ఇలాగే కొనసాగాలని అభిలషించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

