హరిప్రియ విద్యకు కేటీఆర్ సాయం

ట్వీట్ చేసిన 24 గంటల్లోనే నిరుపేద చదువుకు భరోసా
విద్యార్థిని కృతజ్ఞతలు.. గుడ్‌లక్ చెప్పిన మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): న్యాయవిద్య అభ్యసించేందుకు సాయం చేయండంటూ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే ఓ పేద విద్యార్థినికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. పేదరికం వల్ల ఖర్చులు భరించలేకపోతున్నానంటూ చేసిన విజ్ఞప్తికి స్పందించి చదువుకు భరోసా ఇచ్చారు. ‘కేటీఆర్ సర్ నా పేరు అంతగిరి హరిప్రియ. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో నాకు బీఏ ఎల్ఎల్బీ సీట్ వచ్చింది. ఖర్చులను భరించలేం. మేము చాలా పేదవాళ్లం. మా నాన్న రోజు కూలీ. దయచేసి కొంత ఆర్థికసాయం చేయండి’ అని బుధవారం ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘నువ్వు సాధించిన దానికి కృతజ్ఞతలు హరిప్రియా. గుడ్ లక్ ఎట్ నల్సార్’ అని రిప్లయ్ ఇచ్చారు. 24 గంటల్లోనే హరిప్రియకు సాయం చేశారు. దానికి హరిప్రియ ‘సార్ ఈ రోజు మీరు చేసిన సాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా చదువు కోసం మీ విలువైన సమయం, ఆర్థిక సాయా న్ని అందించినందుకు ధన్యవాదాలు. నా సమస్యను 24 గంటల్లో పరిష్కరించేందుకు కృషిచేసిన మీ బృందానికి కృతజ్ఞతలు. నేను మీ అందరికీ నమస్కరిస్తున్నా’ అంటూ కేటీఆర్‌ను కలుసుకున్న ఫొటోలను గురువారం ట్వీట్ చేశారు. ‘హరిప్రియకు సాయం చేసినందుకు ఆనందంగా ఉన్నది. గుడ్ లక్’ అని కేటీఆర్ బదులిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Haripriya
- KTR
- Law course
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

