ఎన్హెచ్ఎం సమ్మెకు కేటీఆర్ మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సమక్షంలో ఎన్హెచ్ఎం జేఏసీ ప్రతినిధులు గురువారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్లు, ఉద్యోగ భద్రత తదితర అంశాలను వారు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
కేటీఆర్ మద్దతుతో తమ ఉద్యమానికి మరింత ధైర్యం, నూతనోత్సాహం పెరిగిందని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌రావు పుట్ట తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్, వినయ్‌భాస్కర్‌కు రాష్ట్ర కమిటీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, హనుమకొండ ప్రతినిధి డాక్టర్ విజయ్‌కుమార్, మేడ్చల్ ప్రతినిధి డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

