తాగి తిట్టినందుకు మర్మాంగాలు కోసేశాడు..!
Man cuts private parts of opponent: ఇరువురి మధ్య మాటామాటా పెరుగడంతో ఒక వ్యక్తి మరో వ్యక్తి చెవిని, మర్మాంగాలను కోసేశాడు.

కొత్తగూడెం: ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ గొడవ దారుణానికి దారితీసింది. ఇరువురి మధ్య మాటామాటా పెరుగడంతో ఒక వ్యక్తి మరో వ్యక్తి చెవిని, మర్మాంగాలను కోసేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ సమీపంలోని రుద్రాపూర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సేల్స్‌మెన్ రుద్రారపు కార్తీక్ పని నిమిత్తం రుద్రాపూర్‌కు వెళ్లాడు. మంగళవారం రాత్రి అక్కడే ఓ సెల్ టవర్ కింద పడుకున్నాడు. అదే సమయంలో తాగిన మైకంలో అటుగా వచ్చిన స్థానికుడు షేక్ హుస్సేన్ పాషా.. కార్తీక్‌తో గొడవకు దిగాడు. వచ్చీ రావడంతోనే బూతులు తిట్టడం మొదలుపెట్టాడు.
దాంతో ఆగ్రహించిన కార్తీక్ తన దగ్గరున్న కత్తితో హుస్సేన్ పాషాపై దాడికి దిగాడు. హుస్సేన్ చెవితోపాటు మర్మాంగాలను కోసేశాడు. దాంతో తీవ్ర రక్తస్రావం అవుతున్న హుస్సేన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు స్థానిక సీఐ సత్యనారాయణ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Brawl
- khammam
- Kottagudem
- Rudrapur
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

