కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : పీజీ మెడికల్, డెంటల్ ఎడ్యుకేషన్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, ఇప్పటికే మొదటి, రెండో విడుతల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సిలింగ్కు అనర్హులని స్పష్టం చేసింది. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ నెల 24, 25వ తేదీల్లో ప్రాధాన్యతాక్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ knruhs.telangana.gov.inలో సంప్రదించాలని కోరింది.