గాంధీలో ఒకేరోజు ముగ్గురికి ‘మోకాలు మార్పిడి’
గాంధీ దవాఖానలో ఒకేరోజు ముగ్గురు రోగులకు ఖరీదైన ‘టోటల్ నీ రీప్లేస్మెంట్' శస్త్రచికిత్సలు నిర్వహించి వైద్యులు రికార్డు సృష్టించారు.
- పైసా ఖర్చులేకుండా ఖరీదైన శస్త్ర చికిత్స
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో ఒకేరోజు ముగ్గురు రోగులకు ఖరీదైన ‘టోటల్ నీ రీప్లేస్మెంట్’ శస్త్రచికిత్సలు నిర్వహించి వైద్యులు రికార్డు సృష్టించారు. నర్సమ్మ(68), ఐలయ్య(65), ఎల్లయ్య(69) అనే వ్యక్తులు కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్లలోని గుజ్జుతోపాటు మోకాలి చిప్పలు పూర్తిగా అరిగిపోవటంతో నడవలేనిస్థితికి చేరుకొన్నారు. ప్రైవేటులో చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గాంధీ వైద్యులను ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శుక్రవారం ముగ్గురికి టోటల్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేశారు. ఒక్కో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు ప్రైవేటులో సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, ఆర్థో విభాగాధిపతి డాక్టర్ రవీందర్ కుమార్ తెలిపారు. గాంధీ దవాఖానలో పైసా ఖర్చులేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

