3న గోదావరి, కావేరి లింకుపై కీలక చర్చ
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 77వ జనరల్ బాడీ సమావేశం కేంద్ర జలవనరులశాఖ నేతృత్వంలో వచ్చేనెల 3న ఢిల్లీ నుంచి హైబ్రిడ్మోడ్లో నిర్వహించనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 77వ జనరల్ బాడీ సమావేశం కేంద్ర జలవనరులశాఖ నేతృత్వంలో వచ్చేనెల 3న ఢిల్లీ నుంచి హైబ్రిడ్మోడ్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ బాలేశ్వర్ ఠాకూర్ శుక్రవారం సమాచారం అందించారు.
సమావేశానికి సంబంధించిన ఎజెండాను సైతం పంపించారు. సమావేశంలో గత జనరల్ బాడీ నిర్ణయాలు, పురోగతిపై చర్చించనున్నారు. అనంతరం రివర్ లింకు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. 17 ప్రాజెక్టుల వా స్తవ పరిస్థితిని వివరించనున్నారు. గోదావరి-కావేరి రివర్ లింకు ప్రాజెక్టు పురోగతిని సైతం సమీక్షిస్తారు.
అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి కావేరి లింకు ప్రాజెక్టును చేపట్టాలని, అందులో భాగంగానే బనకచర్ల లింకు ప్రాజెక్టును అమలు చేయాలని ఏపీ గతంలోనే ప్రతిపాదించడం తెలిసిందే. ఆ ప్రతిపాదనకు ఇప్పటికే కర్ణాటక, తె లంగాణ ఆమోదం తెలిపినట్టు సమాచారం. వచ్చేనెల 3న జరుగనున్న సమావేశంలో దీనిపై మరోసారి చర్చించనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

