రంగనాథ రామచంద్రరావుకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రామచంద్రరావు 'ఓం ణమో' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.

హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రామచంద్రరావు ‘ఓం ణమో’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికవడం పట్ల పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేసిన కృషికి ఫలితం వచ్చిందని పేర్కొన్నారు.
రామచంద్రరావు పూర్వీకులది మైసూరు సమీపంలోని చామరాజనగర్. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేసేందుకు ఆయన అనువాద రచనను ఎంచుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకరకంగా తన అనువాదాలతో తెలుగు, కన్నడ సాహితీ రంగాలకు ఆయనొక వారధిగా ఉన్నారు. దాదాపు 350 పైచిలుకు కథలను రామచంద్రరావు తెలుగు సహా వివిధ భాషల్లోకి అనువదించారు. కథకుడిగా, అనువాదకుడిగా సాహితీ రంగంలో రామచంద్రరావు విశేష కృషి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

