యాదగిరీశుడి సేవలో ముఖ్యమంత్రులు
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
- స్వామివారిని దర్శించుకున్న సీఎంలు కేసీఆర్, భగవంత్‌సింగ్, కేజ్రీవాల్, మాజీ సీఎం అఖిలేశ్
- అద్భుత ఆలయమని అతిథుల కితాబు
హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు. తొలుత కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ వారితో కలిసి అల్పాహారం చేసి, పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పినరాయి విజయన్, డీ రాజా ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేయగా.. మిగతావారంతా ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపం వద్ద అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. ఆ తర్వాత వారు మాడ వీధుల్లో కలియతిరిగారు.
ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, స్థల పురాణం, ఆలయ ప్రాశస్త్యం, ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణం తీరును సీఎం కేసీఆర్ స్వయంగా వారికి వివరించారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కేజ్రీవాల్, భగవంత్‌సింగ్‌మాన్, అఖిలేశ్ యాదవ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. వీరి వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
గుట్ట నుంచి నేరుగా ఖమ్మానికి..
మధ్యాహ్నం 12.50 గంటలకు వీరు యాదగిరిగుట్ట నుంచి నేరుగా హెలీకాప్టర్లలో ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లారు. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు కంటి వెలుగు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం శివారులోనీ వీ వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అశేష జనవాహినిని చూసి మురిసిపోయారు. బహిరంగ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేసిన జాతీయ నేతలు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. కేరళలో మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో సీఎం విజయన్ తొలుత ప్రసంగించి.. ఆ వెంటనే విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి తిరువనంతపురం వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

