CM KCR Public Meeting | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ నేడు(గురువారం) వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రచారం చేయనున్నారు.