KCR Nutrition Kit | | నేటి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
KCR Nutrition Kit | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మాతాశిశు సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్ కిట్‌కు అనుబంధంగా వీటిని అందజేయనున్నారు.
KCR Nutrition Kit | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మాతాశిశు సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్ కిట్‌కు అనుబంధంగా వీటిని అందజేయనున్నారు. మొదటి దశలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నారు. మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.250 కోట్లు కేటాయించారు. ఈ కిట్‌లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో కర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

