Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం
Katta Maisamma | మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Katta Maisamma | మొయినాబాద్, మార్చి04:మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోనికి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేదపండితులతో శత సప్త చండీయాగం నిర్వహించారు.
అనంతరం మహిళలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. వార్షికోవత్సంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. హోమం కార్యక్రమాన్ని ఆదాయ పన్ను శాఖ మాజీ అధికారి రాములు, కె మల్లేశ్ గౌడ్ దంపతుల చేతులు మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త జైపాల్‌రెడ్డి, ఆలయ నిర్వాహకులు కె మల్లేశ్ గౌడ్, జి నర్సింహ్మరెడ్డి, మాజీ సర్పంచ్ ఏ లావణ్య భాస్కరాచారి, మాజీ ఎంపీటీసీ ఈగ రమాదేవి రవీందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గడ్డం అంజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు గడ్డం వెంకట్‌రెడ్డి, నిర్డుల మహేందర్‌రెడ్డి, మల్లేశ్, మైసయ్య, జి మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొంగరి నర్సింహ్మరెడ్డి, పెద్ద వెంకట్‌రెడ్డి, భాస్కరా చారి,ఈగ రవీందర్‌రెడ్డి, పోతుల ప్రభు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

