Tragedy | సౌదీ ఎడారిలో తప్పిపోయి.. కరీంనగర్ యువకుడు దుర్మరణం
Tragedy | ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిలో చనిపోయాడు.
Tragedy | ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిలో చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అల్ హాసా ప్రాంతంలోని ఒక టెలికం కంపెనీలో టవర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు.
జీపీఎస్ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్మెంట్కు చెబుదామంటే ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి.
నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు. ఇక్కడ మనుషులు, ఒంటెలు ఏవీ ఉండవు. దీంతో దారితప్పిన వాళ్లకు సాయం చేయడానికి కూడా ఎవరూ కనిపించలేదు. దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు. వారి మరణవార్తను కుటుంబసభ్యులకు చెప్పారు. కాగా, షహబాద్ మరణవార్త తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

