వాషింగ్టన్లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
వాషింగ్టన్| అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని బేస్‌బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు మృతిచెందారు. వాషింగ్టన్‌లోని నేషనల్పార్క్ బేస్‌బాల్ స్టేడియంలో శనివారం మ్యాచ్ జరుగుతున్నది.

వాషిగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని బేస్‌బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు మృతిచెందారు. వాషింగ్టన్‌లోని నేషనల్స్ పార్క్ బేస్‌బాల్ స్టేడియంలో శనివారం మ్యాచ్ జరుగుతున్నది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. వాషింగ్టన్ నేషనల్స్, సాన్‌డియాగో జట్ల మధ్య ఆట ప్రారంభమయ్యింది. ఇంతలో స్టేడియం వెలుపల నుంచి కాల్పుల మోత ప్రారంభమయింది. దీంతో కొందరు ప్రేక్షలకు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆటగాళ్లు పిచ్‌ను వదిలి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖనకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. కాల్పుల ఘటనతో అధికారులు మ్యాచ్‌ను రద్దుచేశారు. కాల్పులకు తెగబడినవారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

