రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
డిమాండ్ల సాధనకు బుధవారం నుంచి సమ్మె చేపట్టనున్నట్టు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. ఈ మేరకు జూడా ప్రతినిధులు సోమవారం డీఎంఈ వాణికి నోటీసు అందజేశారు.
- ైస్టెపెండ్ పెండింగ్, ఆలస్యంపై గుర్రు
- ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): డిమాండ్ల సాధనకు బుధవారం నుంచి సమ్మె చేపట్టనున్నట్టు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. ఈ మేరకు జూడా ప్రతినిధులు సోమవారం డీఎంఈ వాణికి నోటీసు అందజేశారు. హౌస్సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లకు మార్చి, ఏప్రిల్ నెలల ైస్టెపెండ్ పెండింగ్ ఉన్నదని, ప్రతి నెలా 20-30 రోజులు ఆలస్యంగా ైస్టెఫెండ్ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థికశాఖ నుంచి రెండుమూడు రోజుల్లోనే ైస్టెపెండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు ప్రతినెల రూ.1.25 లక్షల గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ఒప్పుకున్నదని, దీనిని అమలుచేయాలని కోరారు. ఏపీ మెడికల్ కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ సాధించాలని, ప్రభుత్వ దవాఖానల్లో భద్రతకు భరోసా ఇవ్వాలని, హాస్టళ్లను మెరుగుపరుచాలని, ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని, ప్రభుత్వ దవాఖానల్లో వసతులు పెంచాలని నోటీసులో పేర్కొన్నారు.
జూడా అధ్యక్షుడు హర్షసాయి మాట్లాడుతూ.. ప్రతినెల 15 వరకు ైస్టెపెండ్ అందజేస్తామని ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు నెరవేరలేదని చెప్పారు. ఏపీలో జీవో 36 ద్వారా రెండు మూడు రోజుల్లోనే ైస్టెపెండ్ నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలోనూ ఇదే తరహాలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ దవాఖానల్లో విధులను బహిషరించనున్నట్టు వెల్లడించారు. నిరసనల్లో పీజీలు, ఇంటర్న్ స్టూడెంట్లు పాల్గొంటారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

