బాబుకు బెయిల్‌పై సోమవారం తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడమా లేక పోలీసు కస్టడీకి అప్పగించడమా అన్నదానిపై ఏసీబీ కోర్టు సోమవారం నిర్ణయించనుంది.
హైదరాబాద్, అక్టోబర్ 6 ( నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడమా లేక పోలీసు కస్టడీకి అప్పగించడమా అన్నదానిపై ఏసీబీ కోర్టు సోమవారం నిర్ణయించనుంది. చంద్రబాబుకు బెయిల్, కస్టడీ పిటిషన్లపై మూడురోజులపాటు సాగిన వాదనలు శుక్రవారం ముగిశాయి.
అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నామని, సోమవారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. బాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబె, సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బాబును మరో మూడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని, సెంట్రల్ జైలులోనే ఆయనను ప్రశ్నిస్తామని సీఐడీ కోరుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

