రిజిస్ట్రేషన్లు ఎలా తిరస్కరిస్తారు?
ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్ల ద్వారా తలెత్తిన వివాదాలు పరిషారమైనప్పటికీ కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరసరిస్తుండటంపై హైకోర్టు మండిపడింది.
- తిరస్కరణలు రాతపూర్వకంగా ఉండాల్సిందే
- మార్గదర్శకాలు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్ల ద్వారా తలెత్తిన వివాదాలు పరిషారమైనప్పటికీ కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరసరిస్తుండటంపై హైకోర్టు మండిపడింది. కీలక మార్గదర్శకాలు జారీచేసింది. నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో సబ్ రిజిస్ట్రార్లు తమ స్థాయిలో నిర్ణయం తీసుకోవడాని కి అధికారాలు ఉన్నప్పటికీ, మౌఖికంగా తిరసరిస్తున్నారని ఆక్షేపించింది.
ఫలితంగా పలువురు కోర్టుకు రావాల్సివస్తున్నదని, వచ్చాక తాము తిరసరించలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారని పేర్కొంది. ప్రజలు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లకుండానే వివాదాస్పద స్థలాల వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. కోర్టు వివాదం పరిషారమైనా కోర్టు ఉత్తర్వు లు తీసుకురావాలంటూ పెద్దఅంబర్‌పేట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ను తిరసరించడాన్ని స వాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్మెట్కు చెందిన రామేశ్వరీదేవి వేర్వేరుగా 24 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ జరిపారు.
కోర్టులకు జోక్యం చేసుకొనే అధికారం
కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారని జస్టిస్ శ్రవణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల ప్రజల హకులకు సంబంధించి తగిన మార్గదర్శకాలు చేస్తున్నామన్నారు. పట్టణాల్లో ఫ్లాట్లు, యూనిట్లు ఒకోసారి మొత్తం ప్రాపర్టీని నిషేధిత జాబితాలో ఉంచుతున్నారని, ఈ చర్యలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన 300ఏ హకుకు భంగం కలిగిస్తున్నాయని అన్నారు. రిజిస్ట్రేషన్‌లో పారరద్శకత కోసం మార్గదర్శకాలు ఇస్తున్నామని చెప్పారు.
మార్గదర్శకాలు..
రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం వారంలోగా పత్రాలను రిజిస్ట్రేషన్ చేయాలని, లేదంటే తిరసరించాలని న్యాయమూర్తి పేరొన్నారు. కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేయరాదంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సర్యులర్లు జారీ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ను తిరసరించినట్లయితే అప్పటికే చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను వాపసు చేయడానికి సులువైన విధానాన్ని అమలు చేయాలి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్/జనరల్ డైరీ (జీడీ బుక్/ఎంట్రీబుక్/రిజిస్టర్)ను నిర్వహించాలి. నిషేధిత భూములకు చెందిన సెక్షన్ 22ఏను సమర్థిస్తూ వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ ఏపీ, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఏపీ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రిజిస్ట్రేషన్ అధికారులు అమలు చేయా లి. కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా అధికారం ఉన్న సబ్ రిజిస్ట్రార్ /ఎమ్మార్వోలు ఉత్తర్వులు జారీ చేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

