JL Exams | సెప్టెంబర్ 12 నుంచి జేఎల్ పరీక్షలు.. ఇదీ షెడ్యూల్
JL Exams | రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలను సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది.
JL Exams |హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలను సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. పరీక్షలన్నీ సీబీఆర్టీ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నది. పరీక్షకు వారం ముందే https:// www.tspsc. gov.inలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
షెడ్యూల్ ఇలా..
సెప్టెంబర్ 12న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం ఇంగ్లిష్ పరీక్ష, 13న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం బాటనీ, ఎకనమిక్స్, 14న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం మ్యాథ్స్, 20న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం కెమిస్ట్రీ, 21న ఉద యం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం తెలుగు, 22న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం ఫిజిక్స్, 25న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం కామర్స్, 26న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం సివిక్స్, 27న ఉద యం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం హిందీ, 29న ఉదయం జ నరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం హిస్టరీ, సంస్కృతం, అక్టోబర్ 3న ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం ఉర్దూ పరీక్షలు జరుగుతాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రంలో 1,392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి నిరుడు డిసెంబర్ 9న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఆగస్టు 8న అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష
రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్(యూఎల్బీ) నియామక పరీక్షను ఆగస్టు 8న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

