ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ మంగళవారం సస్పెండ్ చేసింది. హుబ్బళ్లిలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగిన కొద్ది నిమిషాలకే సస్పెన్షన్ ప్రకటన వెలువడింది.
- సెక్స్ స్కాండల్‌పై విమర్శలతో జేడీఎస్ చర్యలు
- దోషిగా తేలితే శాశ్వతంగా సస్పెండ్
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ మంగళవారం సస్పెండ్ చేసింది. హుబ్బళ్లిలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగిన కొద్ది నిమిషాలకే సస్పెన్షన్ ప్రకటన వెలువడింది. సస్పెన్షన్‌పై జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ దర్యాప్తులో ప్రజ్వల్ దోషిగా తేలితే అతడిని శాశ్వతంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు.
సస్పెన్షన్‌ను స్వాగతిస్తూనే బీజేపీ కౌంటర్ దాడి
ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ సస్పెండ్ చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. అయితే అదే సమయంలో అధికార కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎదురు దాడి చేసింది.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయం ఇప్పటి వరకు తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. మరోవైపు రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ కర్ణాటక పోలీసులను కోరింది. ప్రజ్వల్ వీడియోలు లీక్ చేసింది నువ్వంటే.. నువ్వని ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కార్తీక్, బీజేజీ నేత దేవరాజె పరస్పరం ఆరోపించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

