సమస్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
Sanjay Kumar | జగిత్యాలలోని చల్గల్ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్..
జగిత్యాల: జగిత్యాలలోని చల్గల్ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు.
ఇటీవల లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్లో సీసీ రోడ్లు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి వాలంటరీ ద్వారా 10 ఎకరాల భూమి కేటాయించారని, అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలనీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాగా, తన వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

