Jagannath Temple | జనవరి 1 నుంచి పూరి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు
Jagannath Temple | ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని నీతి సబ్ కమిటీ నిర్ణయించింది.
Jagannath Temple | భువనేశ్వర్ : ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని నీతి సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే కొంత మంది భక్తులు.. అసభ్యకర దుస్తులు ధరించి వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ మాట్లాడుతూ.. ఆలయ గౌరవం, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ కొంతమంది భక్తులు అసభ్యకర దుస్తులు ధరించి వస్తున్నారని, మతపరమైన మనోభావాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. జీన్స్‌లు ధరించడం, స్లీవ్ లెస్ దుస్తులు, హాఫ్ ప్యాంట్స్ ధరించి బీచ్‌లోకి వెళ్లిన మాదిరిగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. దేవాలయం పవిత్రమైన స్థలం.. వినోదాన్ని పంచే ప్రాంతం కాదని ఆయన స్పష్టం చేశారు. 2024, జనవరి 1వ తేదీ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు రంజన్ కుమార్ దాస్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

