వచ్చే ఏడాది కలరా వ్యాక్సిన్
హైదరాబాద్ కేంద్రంగా మరో కీలక వ్యాక్సిన్ ఉత్పత్తి కానున్నది. నోటి ద్వారా కలరా నిర్మూలనకు అవసరమైన వ్యాక్సిన్ టెక్నాలజీని అంతర్జాతీయ ఫార్మా సంస్థ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ స్థానిక బయాలాజికల్-ఈ ఫార్మా కంపెనీకి అప్పగించింది. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ ఓరల్ కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కానున్నది.
- హైదరాబాద్ కేంద్రంగా మరో వ్యాక్సిన్ ఉత్పత్తి
- ఓరల్ వ్యాక్సిన్ టెక్నాలజీని దక్కించుకున్న బయాలాజికల్-ఈ ఫార్మా కంపెనీ
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా మరో కీలక వ్యాక్సిన్ ఉత్పత్తి కానున్నది. నోటి ద్వారా కలరా నిర్మూలనకు అవసరమైన వ్యాక్సిన్ టెక్నాలజీని అంతర్జాతీయ ఫార్మా సంస్థ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ స్థానిక బయాలాజికల్-ఈ ఫార్మా కంపెనీకి అప్పగించింది. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ ఓరల్ కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కానున్నది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీతో అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధించింది. తాజా ఒప్పందంతో కలరా వ్యాక్సిన్ ప్రపంచానికి అందించే మరో అవకాశాన్ని దక్కించుకొని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫార్మాగా హైదరాబాద్ నిలువబోతున్నది.
భారత్‌తోపాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా వంటి దేశాలు కూడా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుండగా, హైదరాబాద్ వేదికగా తయారుచేసిన వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు హైదరాబాద్ తొమ్మిది రకాల వ్యాక్సిన్లను అందిస్తుండగా, తాజా ఒప్పందంతో మరో వ్యాక్సిన్‌ను సరఫరా చేయబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎదురైన పోటీని నిలదొక్కుకొని ఈ అవకాశం దక్కించుకున్నామని, ప్రాణాంతక కలరా నిర్మూలనలో బయాలాజికల్ ఈ భాగస్వామ్యం కావడం, ఫార్మా రంగంలో తమ బాధ్యతను మరింత పెంచిందని, సురక్షితమైన విధానంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తామని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

