TS Weather | రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు
TS Weather | రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది.
TS Weather | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్, భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాలిలా ఉన్నాయి… దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్ నుంచి ఇండో-చైనా అంతటా పెరుగుతున్న రుతుపవనాల ప్రభావం, తుఫాను ప్రసరణలు, అల్పపీడన ప్రాంతాల ఏర్పాటు కారణంగా జూలై చివరి వారం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం చురుకుగా ఉంటుంది.
పశ్చిమ పసిఫిక్ మీదుగా దక్షిణ చైనా సముద్రం వైపు కదులుతూ తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఈ తుఫాను బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ప్రభావం చూపించనున్నది. జూలై 12 నుంచి 18 వరకు తూర్పు భారతదేశంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది తదుపరి వారం వరకు కొనసాగుతుంది. జూలై 14 నుంచి 17 వరకు పశ్చిమబెంగాల్ తీరం వెంట తుఫాను తీవ్రత ఉంటుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

