ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కొన్ని వీడియోలను గురువారం బయటపెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అయిపోలేదని ఇంకా చాలా ఉన్నదని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమల్ఫైల్స్కు సంబంధించి దాదాపు లక్ష పేజీల కాల్డాటా ఉన్నట్టు తెలిసింది.
ఈ కాల్ డాటాను ప్రత్యేక వృత్తి నిపుణులు విశ్లేషిస్తున్నారని సమాచారం. బీజేపీకి సంబంధించిన అనేక కుంభకోణాల సమాచారం కూడా ఇందులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అనేక మంది ఐటీ నిపుణులు కాల్డాటా, వీడియోల విశ్లేషణలో పాలుపంచుకోవటానికి ముందుకొస్తున్నారని తెలిసింది. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దని, బీజేపీ అక్రమాల పునాదులు పెకిలించాలని ప్రజలు కోరుతున్నారు.