సీడబ్ల్యూపీఆర్ఎస్ చేతికి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో పార్సన్, ఆప్కాన్స్ సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ )నిపుణుల బృందం చేతికి అందింది. త్వరలోనే మరోసారి వచ్చి అధ్యయనం చేస్తామని ఆ బృందం వెల్లడించింది.
- రెండో రోజూ కొనసాగిన పరిశీలన
- ఇరిగేషన్‌శాఖ అధికారులతో ప్రత్యేక భేటీ
హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, మే 23 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో పార్సన్, ఆప్కాన్స్ సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ )నిపుణుల బృందం చేతికి అందింది. త్వరలోనే మరోసారి వచ్చి అధ్యయనం చేస్తామని ఆ బృందం వెల్లడించింది. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుతోపాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై సీపేజీలకు గల కారణాలు, సాంకేతిక సమస్యలపై పూర్తిస్థాయి అధ్యయనానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు ఇరిగేషన్‌శాఖ సీడబ్ల్యూపీఆర్ఎస్ను సంప్రదించింది.
సీడబ్ల్యూపీఆర్ఎస్కు చెందిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ జేఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ సీ డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టివ్ పరీక్షల నిపుణులు డాక్టర్ ప్రకాశ్ పాలె బృందం బుధవారం మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గురువారం సుందిళ్ల బరాజ్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించింది. బరాజ్‌ల్లోని లోపాలపై ఆప్కాన్స్, పార్సన్ సంస్థలు ఇప్పటికే నిర్వహించిన ఈఆర్టీ (ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్) తదితర పరీక్షలకు సంబంధించిన నివేదికలను అడిగి తీసుకున్నది.
సచివాలయంలో భేటీ
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించిన అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం సచివాలయంలో రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలపై అధికారులతో చర్చించింది.
ఎన్డీఎస్ఏ కమిటీ చేసిన మధ్యంతర సిఫారసులకు అనుగుణంగా చేపట్టిన పనులపై ఆ బృందం అడిగి తెలుసుకున్నది. అనంతరం బరాజ్‌లలో లోపాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు తదుపరి టెస్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులకు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ మేరకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకుని త్వరలోనే మరోసారి బరాజ్‌లను సందర్శిస్తామని, అవసరమైన పరీక్షలు చేస్తామని వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

