హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ)లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సోమవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. 2 ప్రొఫెసర్, 4 అసోసియేట్ ప్రొఫెసర్, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఈ నెల 6 నుంచి 8 వరకు హైదరాబాద్లోని నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలుంటాయని వెల్లడించారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ కోసం https://www. tspsc.gov.inను సంప్రదించాలని సూచించారు.