వేములవాడ, మార్చి 6: యూకేలోని హారో ప్రాంతంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఆటపాటలతో సందడి చేశారు. మీనపల్లి శ్రీదేవి, చిరుమామిళ్ల లక్ష్మి, మాదిరెడ్డి సువర్చల, భీమవరపు శ్రీచరణ, క్షీరసాగర ప్రతిమ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు లండన్, సాట్లాండ్, వాలేస్, మిడ్ ల్యాండ్స్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మంది మహిళలు హాజరయ్యారు.