Inter Exams | రేపట్నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం..
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు.
Inter Exams | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లోను ఐదు నిమిషాల సడలింపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోను ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9.05 గంటలు, మధ్యాహ్నం 2.35 గంటల తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అస్సలు అనుమతించరు. అయితే గురువారం ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 29తో ముగుస్తాయి. ఈ సారి 4.2లక్షల విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

