హైదరాబాద్, డిసెంబర్ 25: 2022 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే ఉత్తమ వంటకాల జాబితాలో భారతీయ వంటకాలకు ఐదో స్థానం దక్కింది. టేస్ట్ అట్లాస్ అనే సంస్థ జరిపిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న భోజనప్రియులు ఇండియన్ ఫుడ్‌కు జై కొట్టారు.
ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఇటలీ, గ్రీస్, స్పెయిన్, జపాన్ నిలిచాయి. భారతీయ వంటకాలు 4.54 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. టాప్- 10లో భారత్ తర్వాత వరుసగా మెక్సికో, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, పెరూ దేశాల వంటకాలు చోటు దక్కించుకున్నాయి.