భుజాలపై మృతదేహం తరలింపు.. భద్రాచలం ఏరియా దవాఖానలో ఘటన
వడదెబ్బ బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందిన వ్యక్తిని అతడి బంధువులు చేతులు, భుజాలపై మోసుకెళ్తున్న అమానవీయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులు, వైద్యుల కథనం ప్రకారం..
- సోషల్ మీడియాలో వైరల్
భద్రాచలం, మే 24 : వడదెబ్బ బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందిన వ్యక్తిని అతడి బంధువులు చేతులు, భుజాలపై మోసుకెళ్తున్న అమానవీయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులు, వైద్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కండె వెంకన్న (42) ఆదివారం వడదెబ్బకు గురికావడంతో అతడి బంధువులు స్థానిక ఏరియా దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మరణించాడు.
భావోద్వేగానికి గురైన అతడి బంధువులు వెంకన్న మృతదేహాన్ని చేతులు, భుజాలపై మోసుకుంటూ దవాఖాన బయటకు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ ఈ దృశ్యాన్ని గమనించి చలించిపోయి.. తన అంబులెన్సులో ఉచితంగా వారి ఇంటికి తీసుకెళ్లాడు. దవాఖాన నుంచి మృతదేహాన్ని చేతులపై మోసుకొచ్చారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దవాఖానపై తీవ్రవిమర్శలు రావడంతో సూపరింటెండెంట్ రామకృష్ణ స్పందించారు. దవాఖాన అంబులెన్స్ వచ్చే వరకు వెంకన్న బంధువులు వేచి ఉండకుండా మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

