ఇక ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్డీ.. థీసిస్ రాయడానికి ఇక చెక్
పీహెచ్డీ పూర్తిచేయాలంటే.. రీసెర్చ్ చేయాలి. వందల పేజీల థీసిస్ రాయాలి. దాన్ని ఆచార్యులు మూల్యాంక నం చేయాలి. అప్పుడు వర్సిటీ పీహెచ్డీ ప్రకటిస్తుంది. ఇక ఇలాంటి తంతుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పుల్‌స్టాఫ్ పెట్టనున్నది.
- శ్రీకారం చుట్టనున్న ఐఐటీహెచ్
- మూవీ మేకింగ్‌పై ఎంటెక్ కోర్సు
- ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : పీహెచ్డీ పూర్తిచేయాలంటే.. రీసెర్చ్ చేయాలి. వందల పేజీల థీసిస్ రాయాలి. దాన్ని ఆచార్యులు మూల్యాంక నం చేయాలి. అప్పుడు వర్సిటీ పీహెచ్డీ ప్రకటిస్తుంది. ఇక ఇలాంటి తంతుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పుల్‌స్టాఫ్ పెట్టనున్నది. కొత్తగా ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్‌డీలకు విద్యాసంస్థ శ్రీకారం చుట్టనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్‌డీలను ప్రవేశపెట్టనున్నట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి సోమవారం వెల్లడించారు.
ఇన్నోవేషన్ పీహెచ్‌డీగా..
ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్‌డీలను ఇన్నోవేషన్ పీహెచ్‌డీలుగా పిలుస్తారు. దీంట్లో రీసెర్చ్ స్కాలర్లు థీసిస్ రాయకుండా ఏదో ఒక ప్రొడక్ట్ రూపొందించాలి. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఆవిష్కరణ డెవలప్చేయాలి. చైనాలో ఈ పద్ధతి అనుసరిస్తున్నారు. తయారుచేసిన భౌతిక నమూనాలకు పేటెంట్ హక్కులు పొందవచ్చు. ప్రాజెక్ట్ ఆధారంగానే పీహెచ్‌డీలు ప్రదానం చేస్తారు.
మూవీ మేకింగ్‌పై కోర్సు
కొత్తగా ఐఐటీహెచ్‌లో ఎంటెక్ మూవీ మేకింగ్ కోర్సు ప్రవేశపెట్టనున్నట్టు బీఎస్ మూర్తి తెలిపారు. సినిమా నిర్మాణంలోని ఏడు ప్రధాన దశలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. స్క్రిప్ట్ రాయడం, నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్స్ అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన ఎంటెక్ టెక్నో ఆంత్రప్రెన్యూర్‌షిప్ కోర్సు విజయవంతమయ్యిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

